
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రాలయం క్షేత్రం దర్శనం కోసం విచ్చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు స్పష్టం చేయడమైనది. కర్ణాటక రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని బాధిత కుటుంబాలకు తగిన సహాయం చేయాలని సూచించడం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు