
తిరుపతి: తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్‌షిప్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, తిరుపతి ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తిరుపతి నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువతకు క్రీడా అవకాశాల కల్పన, హస్తకళల రంగ అభివృద్ధి తదితర అంశాలపై ఇరువురు స్నేహపూర్వకంగా చర్చించారు.
అమరావతి ఛాంపియన్‌షిప్ వంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, వారి ప్రతిభను వెలికితీయడానికి దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుపతి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తూ సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరంపై చర్చించారు.
తిరుపతి సమగ్ర అభివృద్ధి, యువత సంక్షేమం, క్రీడా రంగ ప్రోత్సాహానికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.