తణుకు పట్టణంలోని 7వ వార్డు అజ్రంపుంత ఇందిరమ్మ కాలనీ నుండితణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో “జనంలోకి జనసేన –జనంకోసం జనసేన” అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలనుఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. మీడియాతో విడివాడ రామచంద్రరావు
మాట్లాడుతూ అజ్రంపుంత ఇందిరమ్మ కాలనీలో సదుపాయాలు లేవని టౌన్ కి దూరంగా ఉండటం వలన
దీనిని మున్సిపాలిటీ వారు సరిగ్గా పట్టించుకోవడంలేదని. టీడ్కో గృహాలు శిధిలావస్థలో ఉన్నాయని వీటిని బాగు చేయించి అర్హులైన వారికి అందజేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్ తణుకు టౌన్ యూత్ అధ్యక్షులు గర్రె తులసీరామ్, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు, వెంపటాపు రమేష్, రిల్లురాయుడు, మొఖమట్ల సతీష్, శివటం శీను, వీర మహిళలు ఎండ్రా రత్నజ్యోతి, కామవరపు రూప, మంచం పవన్ కుమార్ మరియు 7వ వార్డు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు, వీరమహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.