ఏలూరు: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలను జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరులో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో అతిథిగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా బీసీలు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు బీసీల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఒకరి నొకరు కలవకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. చెయ్యి చా చే విధానాని కి స్వస్తి పలి కి, శాసిం చే స్థా యికి బీసీలు ఎదగాలంటే శాసనసభలో యాభై శాతాని కి పైగా బీసీల ప్రాతిని ధ్యం ఉండా లన్నా రు. అప్ పుడే సమస్యలపై గళం ఎత్తి పరి ష్కరిం చుకోవచ్చు నని తెలి పారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమాని కి 50 శాతాని కి పైగా బడ్జె ట్ కేటాయించి ఖర్చు చేయాలని డిమాం డ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొ రేషన్ పెట్టి ని ధులు కేటాయిం చలేదని , కే వలం మభ్య పెట్టేం దుకే కార్పొ రేషన్ ఏర్పా టు చేసిం దన్నా రు. బీసీలను ఈ ప్రభుత్వం అణగదొక్కిం దన్నా రు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిం దన్నా రు. పెద్దల సలహాలు, సూచనలు తీసుకుం టూ వారి మార్గదర్శ కంలో బీసీల హక్కు ల సాధన కోసం, సంక్షేమం కోసం పోరాడదామని రెడ్డి అప్ప లనా యుడు పిలుపుని చ్చా రు. వచ్చే ఎన్నికల్లో అరాచక, విధ్వంసకర శక్తు లను రాష్ట్రం నుండి తరి మికొట్టేం దుకు బీసీలంతా ఐక్యం కావాలన్నా రు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మేని ఫెస్టో లో బీసీల సంక్షేమాని కి పెద్దపీట వేస్తు న్నట్లు తెలి పారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నా యకులు యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్సీ రామారావు, నూ జివీడు టిడి పి ఇన్చా ర్జ్ ముదిరి బోయిన వెం కటే శ్వ రరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెం కటలక్ష్మి పలు కులసంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీ నా యకులు పాల్గొన్నారు.