
మండల జనసేన యువజన అధ్యక్షుడు బల్ల సతీష్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం తాటిపాక లేఔట్లలో నిర్వహించిన మండల జనసేన పార్టీ యువజన అధ్యక్షుడు శ్రీ బల్ల సతీష్ జన్మదిన వేడుకల్లో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బల్ల సతీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
అనంతరం బల్ల సతీష్‌తో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.