
యువ కథానాయకుడు శ్రీ వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా కోసం చేస్తున్న ప్రాక్టీసులో గాయపడ్డారని తెలిసింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వైద్యులు, ఫిజియోల సూచనలు పాటిస్తూ కోలుకొని, కెమెరా ముందుకు రావాలంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.