
తాడిపత్రి నియోజకవర్గం: అనంతపురం పార్లమెంట్ పరిధిలోని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు అనంతపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఉద్యమి సమన్వయకర్త గౌరవనీయులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు విచ్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, సారంగా మారేష్, తాడిపత్రి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అబ్దుల్ రహీం, తాడిపత్రి పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహ చారి, తాడిపత్రి మండల అధ్యక్షులు కుంకుమ కిరణ్ కుమార్, యాడికి మండల అధ్యక్షులు కోడి సునీల్ కుమార్, పెద్దపప్పూరు మండల అధ్యక్షులు భయపరెడ్డి, పెద్దవడుగూరు మండల అధ్యక్షులు దూద్ వలి తదితర నాయకులు పాల్గొన్నారు.
తాడిపత్రి పట్టణంలో జనసేన పార్టీ పట్టణ, మండల నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి, కండువాలు కప్పి, గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా సీనియర్ నాయకులు కూరగాయల లక్ష్మీపతి, రాయదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్, రాప్తాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ సాకే పవన్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు హాజరై జనసేన ఉద్యమి కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.