జనసేన సభ్యత్వ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయకర్

నందిగామ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం నందిగామలో నిర్వహించిన జనసేన సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించడం, సేవా కార్యక్రమాలను విస్తరించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా ముందుకు రావాలని, సభ్యత్వ కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.