104,108 వాహనాలు ఎక్కడ దాచారు?

104,108 వాహనాలు ఎక్కడ దాచారు?

మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలంటే కరోనా పేషెంట్ 25,000.

గుంటూరు 30,000/- హైదరాబాద్ అయితే 50,000..

ఆక్సిజన్ బండ 11,000 నుంచి 15,000/-

బెడ్ కావాలంటే అవతలి వ్యక్తి ని బట్టీ 5,000 నుంచి ఆ పైన…..
వైద్యం అందుతుందని గ్యారెంటీ లేదు,వైద్యం చేసేది నర్సుల విభాగం మాత్రమే, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టినా తప్పులేదు.

చచ్ఛాక శవం ఇంటి కి తీసుకొచ్ఛి పూడ్చడానికి హీనంగా 40,000 ఖర్చు.

కరోనా లక్షణాలు ఉంటే చేసే రాఫిడ్ టెస్ట్ మరియు ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ని నమ్మే పరిస్థితి లేదు.కానీ ఈ టెస్ట్ విలువ 1500/-

కచ్ఛితంగా తెలియాలంటే సిటీ స్కాన్ తియ్యాలి దాని విలువ:-3000/-

ఇవన్నీ కటిక దరిద్రం అనుభవింఛే సామాన్య ప్రజల వల్ల అవుతుందా? ఇంత ఖర్చు చేసినా సరే….బెడ్,ఆక్సిజన్….ఇంజెక్షన్ లేక మెడిసిన్ దొరికే పరిస్థితి లేదు! ఇవి దొరకడం అంటే లాటరీ తగిలినట్టే.

ఎందుకు అంటే డిమాండ్ తగినట్లు సప్లై లేదు? వైద్యం కి అవసరమైన ఎటువంటి మెడిసిన్ అందుబాటులో లేదు. రెమిడీస్వర్ ఇంజెక్షన్ గురించి జనం భగీరథ ప్రయత్నం చేసి ఆస్తులు అమ్ముకుంటున్నారు.

ఏదో ప్రత్యామ్నాయం ఉంది అని ప్రెస్మీట్ లో ఎవరో డాక్టరమ్మ కబుర్లు చెబుతోంది. ఓకే మరి మీరు చెప్పే మందు బయట కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందా?ఉంటే జనం ఎందుకు చస్తున్నారు?

ఎన్నికల పైన…..విద్యార్థుల పరీక్షల పట్ల ముందు చూపుతో ఆలోచించే రాజన్న బిడ్డ వాక్సిన్ కోసం ఇప్పుడు లేఖలు రాసి ఏంటి ప్రయోజనం?

ఆ వ్యాక్సిన్ కూడా సమాజంలో కాస్త పలుకుబడి లేదా వైద్య సిబ్బంది తెలిసిన వారికే ఇప్పటి వరకూ వెళ్ళింది ఇది నూటికి నూరు శాతం నిజం!

ఊరికో కోవిడ్ -సహాయ శిబిరం ఏర్పాటు చెయ్యాలి.
24 గంటలు అందుబాటులో ఉండాలి.
బియ్యం డోర్ డేలివరీ వాహనాలను ప్రతి గ్రామంలో ఈ పరిస్థితి సర్థుకునే వరకూ కోవిడ్ ఎమర్జెన్సీ వాహనం లా మార్చి…..దానితో పాటు ఆక్సిజన్ బండ ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలి.

బెడ్లు లేకపోతే ఏం చెయ్యాలో తెలియని స్థితికి తీసుకొచ్ఛారు. కరోనా వస్తే ప్రాణాలు ఉండవ్ అనే దయనీయమైన ఆలోచన ప్రజలకు వచ్ఛేసింది. జీతాలు పెంచాల్సింది.భజన చేసే వారికి కాదు.
వైద్య సిబ్బంది కి….డాక్టర్లకి, పారిశుద్ధ్య కార్మికులకు. ప్రోత్సాహలు ఇవ్వాల్సింది వాలెంటీర్లకి కాదు డాక్టర్లు, నర్సులు, ఇతర వైధ్య సిబ్బందికి.

డబ్బు లేదంటే ఉచితాలు, తాయిలాలు సంవత్సరం పాటు ఆపేయండి. పనికి రాని, పనికి మాలిన సలహాదారులని తీసేయండి, అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ప్రజలు ప్రాణాల పై ఆశలు వదిలేసుకున్నారు ఫైనల్ గా దేవుడి పైన భారం వేసేశారు, ప్రభుత్వం నేనున్నాని అదుకునే సమయం ఇదే, ఆదుకోలేకపోతే ఉన్నా లేనట్టే

జై హింద్

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.