తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకున్నా పట్టించుకోని
ప్రభుత్వం. వారికి అండగా కార్మికుల సమ్మెకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు,
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మరియు తిరుపతి జనసేన నాయకులు మద్దతు
తెలిపారు. కార్మికుల సమ్మె 10వ రోజు కార్యక్రమంలో భాగంగా సులభ్ కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడును
చెప్పుకోవడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ గారితో పాదయాత్రగా
అలిపిరి వద్దకు శ్రీ వెంకటేశ్వరస్వామి కి కొబ్బరికాయలు కొట్టి వారి గోడును తెలియజేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, తిరుపతి నగర ఉపాధ్యక్షులు
ఆనంద్, పార్ధు, నగర కార్యదర్సులు, మనోజ్ కుమార్, రుద్ర కిషోర్ రెడ్డి, కిరణ్ కుమార్, షరీఫ్, సాయి దేవ్,
రవి, శిరీష, రాయలసీమ వీరామహిళా కోఆర్డినేటర్ ఆకుల వనజ, సీనియర్ నాయకులు రమాదేవి, దివ్య,
ముత్యాలు, జిల్లా కార్యదర్శులు, కలప రవి, బాటసారి, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.