వైసీపీ పాలకులు, ఆ పార్టీ నేతలలో ఉన్న హింసా త్మక ధోరణులు రోజురోజుకీ ప్రబలుతున్నాయని
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ రోజు రాప్తాడులో వైసీపీ సభ దగ్గర ఉద్యోగ విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణపై ఆ పార్టీ మూకలు
చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ దాడి జరుగుతున్నా పోలీసులు నిలువరిం చకపోవడం దురదృష్టకరం.
ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందిం చి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల గుం టూరు జిల్లా పెదకూరపాడులో
ఇసుక మాఫియా గురిం చి వార్త రాసేం దుకు వెళ్లిన విలేకరిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది
నెలలకే తునిలో ఓ విలేకరిని హత్య చేశారు. ఈ పాలనలో జర్నలిస్టులపై హిం స పెరిగిపోతోం ది. పాత్రికేయులను, మీడియా
యాజమాన్యాలను కట్టడి చేసేలా జీవోలు తీసుకువస్తున్నారు. వైసీపీ వైఖరిని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి అని
జనసేనాని కోరారు.