వంగవీటి రాధాను కలిసిన
డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను జనసేన ఉమ్మడి చిత్తూరు జిలా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ మర్యా దపూర్వకంగా కలిశారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన్ని కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాపు సామాజిక వర్గ అభివృద్ది , రాజకీయాల్లో కాపుల పాత్రపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. జనసేన, టిడిపి పొత్తు , ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.