విశాఖ: విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదానికి గురైన 49 మృత్యుకార కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు అందజేసిన పవన్ కళ్యాణ్ కు మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారంమీడియా ముఖంగా మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మత్స్యకారు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుం దని ఆయన భరోసా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అదేవిధంగా విశాఖ హార్బర్ లో దండుపాళ్య గ్యాంగులు, చీకటి మూకలు రెచ్చిపోతున్నాయి దాడులు బెదిరింపు లతో మత్స్యకార కష్టాలను దోచుకుం టున్నా రని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి దౌర్జన్యా లు రూపుమాపి మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటా రని అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు 80 శాతం నష్టపరిహారమని చెప్పి కంటితుడుపు చర్యలతో మత్స్యకార కుటుంబా లకు అన్యా యం చేస్తున్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం
కళ్లు తెరవాలి దగ్నమైన బోట్ల కుటుంబా లను ఆదుకోవాలని డిమాం డ్ చేస్తున్నాం , అదేవిధంగా
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులను మరియు
వారి కుటుంబా లను అన్ని విధాలుగా ఆదుకుంటా మని చెప్పడం సంతోష తగ్గ విషయమని
తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కమిటీ సభ్యు లు గోట్లురు జీవి,
కోటికి రామాం జి, తలారి ప్రతాప్ పాల్గొన్నారు.