పాడేరు: జనసేన పార్టీ కార్యాలయం వేదికగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు నియోజకవర్గ మొదటి సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ తరుపున అధ్యక్ష బాధ్యతలు వహించిన జనసేన పార్టీ సమన్వ కర్త అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ ఇరుపార్టీల అధినేతల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ పతనమే లక్ష్యంగా పని చేయాలని అందుకు జనసైనికులు, నాయకులు, వీరమహిళలు తమతమ శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేసి ఈ రాక్షస ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు ఆ పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ కచ్చితంగా కలిసి సమిష్టి నిర్ణయంతో పనిచేద్దామని అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీ నాయకులతో కలిసి గిరిజన ప్రజలకు వైసీపీ వాస్తవ రాజకీయాలపై చైతన్యం కలిగించే ప్రణాళిక చేద్దామన్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకు , తెలుగుదేశం నాయకులకు జనసేనపార్టీ సమన్వకర్తడా. వంపూరు గంగులయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. పాడేరు నియోజకవర్గ వివిధ మండలాల జనసేనపార్టీ వీరమహిళలు, కిటలంగి పద్మ, దివ్యలత దుర్గాలతా , పార్వతి , అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, మసాడి భీమన్న, కిల్లో రాజన్, ఉల్లి సీతారామ్, గొంది మురళి, వంతల బుజ్జి బాబు, రాజారావు, రాజు, లక్షమన్, కొయ్యం బాలరాజు, అంకిత్ జర్ర, తెరవాడ వెంకట రమణ, తల్లే త్రిమూర్తులు, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.