విశాఖ దక్షిణ నియోజకవర్గం : జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సేవల కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రతి ప్రాంతంలోనూ పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో వ్యక్తి గతంగా కూడా పలు సేవలు కొనసాగిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం 106వ రోజుకు చేరుకుంక్ింది. ఈ కార్యక్రమంలో భాగంగా 38వ వార్డు బుక్కా వీధి ప్రాంతంలో పెళ్లి కుమార్తెకు మౌనికకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ పదిమందికి మంచి చేయడమే తన లక్ష్యమన్నారు. తాను చేసే సేవా కార్య క్రమాలలో ఎటువంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవారికి తన సేవలో అంద ించాలని కృతనిచ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో పలుసేవా కార్య క్రమాలు చేపడుతున్నట్లు వెల్లడ ించారు. ఈ కార్య క్రమంలో జనసే న నాయకు లు నాయుడు, శ్రావణి, అరుణ్, రమేష్, సతీష్, పోలి, పైడిరా జు, లక్ష్మ ణ్, లక్ష ణ, పోలా, సురే ష్, బద్రి సతీష్, దేవి, కనకమహాలక్ష్మి, సత్య , లక్ష్మి, సువర్ణ కు మారి, రా వులమ్మ, గౌస్, మంగ, లలిత, గౌరీ , దుర్గ, కు మారి, కందుల కేదార్నా థ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.