పోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరిలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో నిర్వహించునున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
![](http://kingofandhra.com/wp-content/uploads/2019/01/pm4.jpg)
ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను జనసేన నాయకులు పూర్తి చేయగా మరికొంత సమయంలో జనసేనాని బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న జనసైనికులు జనసేనాని రాక కోసం ఎదురుచూస్తున్నారు. జనసేన నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగుతుంది.