కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చేపడుతున్న పోలింగ్ కేంద్రాలలో ఓటు పరిశీలన కార్యక్రమంలో రెండవరోజు దుమ్ములపేట పోలింగ్ కేంద్రాల వద్ద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఓటు అన్నది భారత రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప హక్కు అని గుర్తించుకుని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ప్రతి ఓటరు బాధ్యతగా తన ఓటు వివరాలు జాబితాలో సరిగా ఉన్నా యోలేవో చూసుకోవాలని సూచించారు. దురదృష్టం కొద్దీ మనం ఏనాడూ ఊహించని విధంగా నేడు ఈ వై.సి.పి ప్రభుత్వం హయాములో ఓటరుల జాబితానుం డీవ్యతిరేక పార్టీ ఓటరులని గందరగోళానికి గురిచేస్తూ అక్రమంగా వారి కికూడా తెలియకుండా వారి ఓటుని, ఇంకో పక్క వేరే ప్రాంతాల వారిని ఇక్కడ కూడా ఓటరులుగా నమోదు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ ముఖ్యమంత్రి వైనాట్ 175 అని అంటే దానర్ధం ఇదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా గెలవలేమని ఈ వై.సి.పి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోం దనీ దీనిపై ప్రజలందరూ అప్రమత్తమై తమ ఓటు ని కాపాడుకుని వై.సి .పి ని వచ్ చే ఎన్ నికలలో ఓడిం చి బుద్ధి చెప్పా లని పిలుపునిచ్చా రు. ముత్తా శశిధర్ గారి సూ చనల మేరకు నగరంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యు క్త కార్య దర్శి వాశిరెడ్ డి శివ సూర్య నారాయణపురంలోని పోలింగ్ కేంద్రాలను, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య సాలిపేట ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ జాబి తాలను పరి శీలిం చారు. ఈ కార్య క్రమంలో నగర ఉపాధ్య క్షుడు అడబాల సత్యన్నారా యణ, సి టీ సెక్రెటరీ కొండ దుర్గాప్రసాద్, మోస ఏసేబు, దాసరి వీరబాబు, అమర్నాథ్, దొర, ఎల్లాజీ, చిన్న తదితరులు పాల్గొన్నారు.