సంకురాత్రి ఫౌండేషన్ ను సందర్శించిన జనసేన బృందం
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సందర్శన
• సంకురాత్రి ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలకు జనసేన మద్దతు ఉంటుందని హామీ
కాకినాడ జిల్లాలో సంకురాత్రి ఫౌండేషన్ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం కాకినాడ సమీపంలోని ఆసుపత్రిని పరిశీలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ గారితో సమావేశమై సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల శ్రీ చంద్రశేఖర్ గారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు, సేవలను వివవరించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరిచేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహాయసహకారాలు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఓ బృందాన్ని సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ కిరణ్ ఆసుపత్రికి పంపారు. ఈ బృందం శ్రీ చంద్రశేఖర్ గారితో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్ ను అత్యున్నత సాంకేతిక సంపత్తితో ఆధునీకరించినట్లు తెలిపిన శ్రీ చంద్రశేఖర్ గారు, వీలయితే ఆపరేషన్ థియేటర్ ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తామని శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు తెలియచేశారు. ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు జనసేన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
సంకురాత్రి ఫౌండేషన్ సందర్శించిన జనసేన పార్టీ బృందంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పిఠాపురం ఇంఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి నగర అధ్యక్షులు శ్రీ వై.శ్రీనివాస్, గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ శ్రీ మురాలశెట్టి సునీల్ కుమార్, పార్టీ నేతలు శ్రీ చక్రవర్తి, శ్రీ తలాటం సత్య, శ్రీ రావాడ నాగు, శ్రీ మోకా నాని, శ్రీ తుమ్మలపల్లి చందు, శ్రీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.