శ్రీ రోశయ్య రెం డో వర్ధం తి సందర్భం గా నివాళు లర్పిం చిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెం డ్ల మనోహర్ రాష్ట్ర ముఖ్య మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర పాలనలో చెరిగిపోలేని ముద్ర వేసిన నిబద్ధతగల నాయకుడు శ్రీ కొణిజేటి రోశయ్య గారు.. హుందాతనం నిండిన రాజకీయాలు సాగించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా సోమవారం తెనాలిలో ఆయన విగ్రహానికి శ్రీ మనోహర్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కీలకమైన సమయంలో రాష్ట్ర ము ఖ్య మంత్రిగా బాధ్య తలు చేపట్టిన శ్రీ రోశయ్య గారు రాష్ట ్రాన్ ని అభి వృద్ ధి దిశగా నడిపిం చడంలో తన వంతు కృషి చేశారు. శాసనసభలో ఎప్పు డు ఉల్లా సంగా, ఉత్సా హంగా ఉంటూ అందరికీ సమాన గౌరవం ఇచ్చే రోశయ్య గారు శాసనసభకే హుందా తనం తీసుకొచ్చా రు. నిం డుగా ఎప్పు డూ నవ్వు తూ, కొత్తవారిని ప్రోత్స హిస్తూ రాజకీయాలు చేశారు. శాసనసభలో శ్రీ రోశయ్య గారు ఉన్న పుడు నేను శాసన సభాపతిగా వ్య వహరిం చడం మరచిపోలే ని అనుభవం. రాజకీయాలతో సంబంధం లేకుం డా రాష్ట్ర అభి వృద్ ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నిత్యం ఆలోచిం చే ఆయన వ్యక్తి త్వం నేటి రాజకీయ నాయకులకు స్ ఫూర్తిదా యకం. పదవులు ఉన్నా , లే కున్నా ఆయన వ్య వహార శైలి ఎప్పు డు ఒకేలా ఉండేది. ప్రజలతో మమేకం కావడానికి, వారికి ఏది అవసరమో అది నెరవేర్చడానికి శ్రీ రోశయ్య గారు నిరంతరం తపిం చేవారు. తెనాలి పట్టణానికి ఎన్నో అభి వృద్ ధి పనులు చేశారు” అన్నా రు. శ్రీ రోశయ్య గారి విగ్రహానికి ఆయన కుమారుడు శ్రీ కొణిజేటి శివ పూలమాలలు వేసి స్మరిం చుకున్నా రు. ఈ కార్య క్రమంలో ఆర్య వైశ్య సంఘం పెద్దలు, తెనాలి ప్రము ఖులు శ్రీ నూ కల వేణు, శ్రీ పొన్నూ రు శశి, శ్రీ ఉప్పల వరదరాజులు, శ్రీ మాలేపాటి హరి, శ్రీ కొణిజేటి గోపి , శ్రీ బూరెల నరసిం హారావు, శ్రీ రావూరి సుబ్బారావు, శ్రీ రజనీకుమార్, శ్రీ చుండూరు సాయి, శ్రీ పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.