జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకీనీడి శేషుకుమారి పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను సందర్శించి స్థానిక కౌలు రైతులతో చర్చించి పంట నష్ట వివరాలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటను నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తేం నానాజీ, నామా బుల్లి కాసులు, కొత్తేం రాంబాబు, విశ్వనాథం నానాజీ, కాయల పవన్, కొడమంచిలి దుర్గా ప్రసాద్, కిరణ్, లచ్చ, అయ్యప్ప, సాయి, గోకివాడ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి 8వ రోజ
పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా 8వ రోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం సురాడ పేట, మాయపట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో శేషుకుమారి స్థానిక
ప్రజలతో, మత్సకారులతో మమేకమై వారి కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు వారికి ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్యలు, తుఫాన్ సమయాల్లో సముద్రం కోతకు గురై రక్షణ ఉండటం లేదని వివరించి, వాటిని పరిష్కరించాలని కోరారు. స్థానిక యువత మరియు మహిళలు ఉత్సాహంగా పాల్గొని, వారి మద్దతు తెలిపారు. శేషు కుమారి గారు మాట్లాడుతూ సురాడ పేట గ్రామంలో దుర్భరమైన సమస్యలు ఉన్నాయని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎంపీటీసీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వారికున్న రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారికి ఎన్నో సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న గట్టును కూడా ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురాడ శ్రీను, మెరుగు ఇజ్రాయేల్, ప్రసాద్, స్వామి, గోపి, నరసింహాముర్తి, రాజేష్, బాబ్జీ, కోటి,
బాలు, అభి, రాజేష్, ప్రసాద్, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.