గజపతినగరం: జనసేన మరియు టిడిపి ఆత్మీయ సమావేశంలో కార్యచరణపై దిశా నిర్దేశం చేసిన గజపతినగరం నియోజకవర్గ సమన్వ యకర్త మర్రాపు సురేష్ మరియు టిడిపి ఇంచార్జ్ డా.కె.ఏ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా జనసేన టీడీపీ ఐక్యంగా ముందుకు సాగుతాయని చెప్పడం జరిగింది, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తూ టిడిపి జనసేన పార్టీ కలిసి పనిచేస్తాయని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ మాకలయిక మా ప్రయోజనాలు కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలవడం జరిగిందని చెప్పడం జరిగింది. 17వ తేదీ నుంచి జనసేన టిడిపి పార్టీల మినీ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లి వారికి మనం చేస్తున్న పనులు, చేయాలనుకుంటున్నా పనులు వివరించాలి 18,19 తేదీల్లో ఈ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలలో రోడ్ల వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితిని వివరించాలి. అంతేకాకుండా డిజిటల్ క్యాంపెనింగ్ చేయవలసి ఉంటుంది సో షల్ మీడియా ద్వారా రోడ్ల పరిస్థితిని ప్రజలకు వివరించవలసి ఉంటుంది తెలిపారు. టిడిపి అబ్జర్వర్ ప్రసాద్ మరియు జనసేన జిల్లా కోఆర్డి నేటర్ లోకం మాధవి మాట్లాడుతూ ప్రతివారంలో ఒకరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించవలసి ఉంటుంది ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలకు నిదర్శనంగా ఈ ప్రభుత్వంపై చార్జిషీట్ నమోదు చేపించాలి. ఎన్నికలు రావడానికి మనకు 120 రోజులు మాత్రమే సమయం ఉంది అందరూ ఈ సమయం గుర్తు తెరిగి పనిచేయవలసి ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్యాక్ మెంబర్ పడాల అరుణ గారు,జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, టిడిపి మరియు జనసేన మండల అధ్యక్షులు, వీరమహిళ దుర్గా , టిడిపి సీనియర్ నాయకులు బండారు బాలా జీ, చైతన్య, అల్లు విజయ, భాస్కర్ నాయుడు నాయకులు కార్యకర్తలు గజపతినగరం సీనియర్ నాయకులు కలిగి పండు ఆదినారాయణ శ్రీను, హేమ సుందర్, లక్ ష్మణ్ సోమిరెడ్డి ధనుంజయ్, అప్పారావు, బద్రి వర్మ రాజు ఆదినారాయణ గోవిందు, వెంకటేష్ బాలు యాదవ్ జనసైనికులు పాల్గొన్నారు.