విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో సుమారు 60 బోట్ లు అగ్నిప్రమాదానికి గురైన వార్త దిగ్బ్రాంతికి గురిచేసింది. వార్త తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన జెట్టిలను పరిశీలించి, మత్స్యకారులతో మాట్లాడి ప్రమాద తీరును అంచనా వేయటం జరిగింది.
ఈ సందర్భంగా మత్స్యకారులకు @janasenaparty అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఉపాధి కోల్పోయిన అందరికీ జనసేన పార్టీ తరపున భరోసానివ్వటం జరిగింది. ప్రమాదానికి కారణం ప్రభుత్వ పర్యవేక్షణ లోపించటమే. ఈ ప్రమాదంలో కాలిపోయిన ఒక్కొ బోటు విలువ సుమారుగా 40 నుంచి 50 లక్షలు ఉంటుంది. దాదాపు 40 కోట్లకు పైగా ఆస్థి నష్టం జరిగింది.
వందలాది మంది మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోయారు. ప్రభుత్వం తక్షణమే బాధితులను ఆదుకోవాలి, వారికి జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము.