రాజంపేట: తొగురు పేట రామచంద్రపురంనకు చెందిన చెయ్యేరు వరద బాధితుడు శివారెడ్డికి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదివారం రూ 30 వేలు విలువచేసే ఇంటి సామాగ్రి వితరణ చేశారు. కొయ్య సామాగ్రితో పాటు సిమెంట్ బస్తాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ జవాద్ తుఫాను సమయంలో అన్నమయ్య డ్యామ్ తెగిపోయి సర్వం కోల్పోయిన పరివాహక ప్రాంత ప్రజలకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని అన్నారు. నేటికీ అనేకమంది వరద బాధిత ప్రజలు గుడారాలలోనే జీవనం సాగిస్తున్నారని, మరికొందరు దాతల సహాయంతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి అండగా జనసేన పార్టీ తరపున నేడు తనవంతు సహాయం అందించడం జరిగిందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజల కష్ట-నష్టాలను తెలుసుకొని వారికి చేయూతనందించడంలో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కొత్తూరు వీరయ్య ఆచారి కిటికీలు, దాలుబందరాలు ఉచితంగా చేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని తెలిపారు.