• తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు ఇవ్వాలి
మిగ్ జామ్ తుపాను తీవ్రతతో రాష్ట్రం అతలాకుతలమై ప్రజానీకం ఇక్కట్ల పాలవుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. తుపాను సహాయక శిబిరాల్లో ని ఏర్ పాట్లపై బాధితులు అసంతృప్తితో ఉన్నారు. ఆహారం, మందులు అందించడంలో ప్రత్యేక దృష్టిపెట్టాలి అని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది . లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బ తిన్నట్లు సమాచారం అందుతోంది .ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విజయనగరం జిల్లాల్లో వరిసాగు చేసిన రైతులు కన్నీళ్లతో ఉన్నారు. చాలా చోట్ల కోతల దశకు చేరింది . కోసిన పంట కావచ్చు, పొలాల్లో ఉన్న పంట కావచ్చు తడిసిపోయింది . ఇప్పుడు అదనంగా ఎకరాకి రూ.10 వేలు ఖర్చు వస్తుందని రైతులు ఆవేదన చెందటం పార్టీ దృష్టికి వచ్చింది . ప్రభుత్వం తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు అందించాలి. అలాగే రాయలసీమ జిల్లాలో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి . అరటి, బొప్ పాయి చెట్లు నేలకొరిగాయి . వీటితోపాటు పొగాకు, మినప, శెనగ, మిర్చి తది తర పంటలు దెబ్బతిన్నాయి . రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.7 వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లి నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది . పంట నష్టాన్ని గణించడంలో వాస్తవికతను ప్రతిబింబించాలి. కరవు మండలాలను గుర్తించే విషయంలో తూతూ మంత్రంగా లెక్కలు వేశారు. మిగ్ జామ్ నష్టం విషయంలోనూ అలాగే తప్పుడు లెక్కలు వేస్తే రైతులకు అన్యాయం చేయడమే అవుతుందితుంద. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతులను ఆదుకొనే విధంగా చర్యలు ఉండాలి. ఈ ప్రభుత్వం రైతులకు పంటల బీమా విషయంలోనూ నిర్లక్ష్యం వహించింది . దీనికి బాధ్యత వహిస్తూ పూర్తి నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలి అని జనసేనాని డిమాండ్ చేశారు.