రాజానగరం నియోజకవర్గంలో జనసేన-టిడిపి ఆత్మీయ సమావేశం

రాజానగరం నియోజకవర్గం : కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ద్వారకామయి ఫంక్షన్ హాల్ నందు ఏర్పా టు చేసిన రాజానగరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కో- ఆర్డి నేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి మరియు జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలలో భవిష్యత్ కార్యా చరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీని గద్దె దింపేందుకు కలిసి కట్టుగా సమిష్టిగా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.