ప్రముఖ నటులు శ్రీ చంద్రమోహన్ గారి అకాల మరణ వార్త బాధాకరం. దాదాపు 900 పైగా చిత్రాల్లో నటించి, 175 చిత్రాల్లో హీరోగా నటించిన నాటి తరం కథానాయకుడు మరణం సినీ రంగానికి తీరని లోటు. జనసేన పార్టీ తరపున ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.