• ఉపాధ్యా యుల సమస్య ల పరిష్కా రాని కి సానుకూ లంగా స్పం దిస్తాం
• విద్యార్థు ల వికాసాని కి జనసేన కట్టు బడి ఉంది
- మాతృ భాష పరి రక్ష ణకు శ్రీ పవన్ కళ్యా ణ్ కృషి చేస్తున్నా రు
• ఏపీటీఎఫ్ ప్రతిని ధులతో జనసేన పార్టీ రాజకీయ వ్య వహారాల కమిటీ ఛైర్మ న్ శ్రీ నాదెండ్ల మనోహర్
వైసీపీ ప్రభుత్వం ప్రతి రంగాన్నీ , ప్రతి వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోందని … ముఖ్యంగా పాఠశాల విద్యా వ్యవస్థపట్ల ఈ పాలకులు అనుసరిస్తున్న వైఖరి వల్ల విద్యార్థులు నష్టపోతున్నారనీ, ఉపాధ్యాయులు అవస్థల పాలవుతున్నారు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం నాడు – నేడు అంటూ ప్రచారం చేసుకొంటూ పాఠశాలల్లో ఉన్న సమస్యలను మరుగునపడేస్తోందన్నా రు. ఉపాధ్యాయుల విషయంలోనూ ప్రభుత్వం కక్ష సాధిం పు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థుల వికాసం పట్ల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికీ జనసేన సానుకూల దృక్పథంతో స్పందిస్తుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం తెనాలిలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరే షన్ (ఏపీటి ఎఫ్) ప్రతిని ధులు కలసి తమ సమస్య లను తెలియచేస్తూ విజ్ఞా పన పత్రం అందిం చారు. ఈ సందర్భం గా వారి తో పాఠశాల విద్య పై చర్చిం చారు. శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మూడో తరగతి పిల్లలకు టోఫెల్ పరీక్ష లు, ఐబీ సిలబస్ అంటూ రాష్ట్ర విద్యా వ్య వస్థపై జగన్ సర్కా ర్ ప్రయోగాలు చేస్తోం ది. వీటి మూలంగా విద్యార్థు లలోనూ , ఉపాధ్యా యుల్లోనూ గందరగోళం నెలకొంటోం ది. సీబీఎస్ఈ సిలబస్ విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ ధి కనబరచలేదు. మాతృభాషను ని ర్లక్ష్యం చేస్తోం ది. మాతృ భాష పరి రక్ష ణకు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు కృషి చేస్తున్నా రు” అని తెలిపారు. ఏపీటీఎఫ్ ప్రతిని ధులు మాట్లాడుతూ పాఠశాల విద్యా రంగం సంక్షోభాని కి కారణమైన జీవో 117 రద్దు చేయడం, ప్రాథమిక పాఠశాల నుం చి 3, 4, 5 తరగతు ల విలీన ప్రక్రియను వెనక్కి తీసు కొని ప్రాథమిక పాఠశాలలు, ఉన్న త పాఠశాలలూ వేర్వే రుగా కొనసాగిం చడం, పీఎఫ్, ఈఎల్స్ , డీఏ బకాయిల చెల్లిం పు, డీఎస్సీ ని ర్వ హణ, పదోన్నతు ల కల్పన తదితర అంశాలను ప్రస్తావిం చారు. ఉపాధ్యా య ప్రతిని ధులు ప్రస్తావిం చిన అంశాలన్నింటి నీ జనసేన అధ్య క్షులు శ్రీ పవన్ కల్యా ణ్ గారి దృష్టి కి తీసు కువెళ్తామని , వీటి పై సమగ్రం గా చర్చిస్తా మని హామీ ఇచ్చా రు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ ప్రతిని ధులు శ్రీ కె.బసవలిం గారావు, శ్రీ మహమద్ ఖలీద్, శ్రీ పుట్టా జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు.