• హైదరాబాద్ లో ప్రత్యేకంగా భేటీ
• రెండున్నర గంటలపాటు సుదీర్ఘం గా చర్చలు
• ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు, వచ్చే ఎన్ని కల వ్యూ హాలే ప్రధాన అజెం డాగా సమావేశం
• ఉమ్మడి మేని ఫెస్టో, సమన్వయంపైనా ప్రణాళిక
• భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన శ్రీ నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆదివారం రాత్రి ప్రత్యేక భేటీ హైదరాబాద్లో జరిగింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు. సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కీలక భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నా రు. భేటీ అనంతరం వివరాలను శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు మీడియాకు వివరిం చారు. ఈ సందర్భం గా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగిం ది. అనేక అంశాలపై చర్చలు సుహృద్భా వంగా జరిగాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్ని కల్లో సమష్టిగా ఎలా ముం దుకు వెళ్లాలనే దాని పైనా, ఉమ్మడి మేని ఫెస్టోను బలంగా ప్రజల్లో కి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముం దుకు వెళ్లాలని ని ర్ణయిం చారు. వచ్చే ఎన్ని కల్లో రెం డు పార్టీల కార్య కర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముం దుకు వెళ్లాలి..? దాని కోసం ప్రత్యేక వ్యూ హంపైనా ఓ సమష్టి కార్యా చరణ తీసుకున్నాం . భవిష్యత్తు రాజకీయ కార్యా చరణ గురిం చి, ఎన్ని కల యాక్షన్ ప్లా న్ గురిం చి చర్చించాం . ఎన్ని కల్లో అనుసరిం చాల్ సిన వ్యూ హాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థా యిలో చర్చిం చారు. వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుం డా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేం దుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థా యి చర్చ జరిగిం ది. అధినేతల మధ్య జరిగి న భేటీలో చర్చకు వచ్చి న ఇతర కీలకమైన అంశాల గురిం చి తర్వా త ప్రత్యేకంగా మాట్లాడుతాం ’’ అన్నారు.