ధర్మవరం టౌన్, ధర్మవరం రూరల్, బత్తలపల్లి మండలాలకు సంబంధించిన బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా “నా సేన కోసం నా వంతు ” లో భాగంగా ప్రజలకు అండగా ఉండే జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసుదన్ రెడ్డి 1 లక్ష రూపాయలను మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు 2 లక్షల 6 వేల రూపాయలను మొత్తం 3 లక్షల 6 వేల రూపాయలను జనసేన పార్టీకి విరాళం అందించడం జరిగింది. విరాళం అందజేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా మధుసూదన రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నా సేన కోసం నా వంతు క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.