
తాడేపల్లిగూడెం నియోజకవర్గం : తాడేపల్లిగూడెం మండలం, దండగర్ర గ్రామంలో రెండు రోజుల పాటు పల్లేపోరు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌కి గ్రామ జనసేన నాయకులు, గ్రామ ప్రజలు భ్రమ్మ రధంపట్టారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనువాస్ మాట్లాడుతూ రోడ్ల పరిస్థితి చూస్తే అడుకో గుంత, గజానికో గొయ్యలా రోడ్ల పరిస్థితి మారిందని గుంతల రోడ్లపై ప్రయాణం వాహనదారులకు ప్రాణసంకటంలా ఉందనీ, కనీసం రోడ్ల మరమ్మతులు చేయక ప్రయాణం చేసే ప్రజలు ఇబ్బందులు ఈ ప్రభుత్వనికి కనపడవని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మన మంత్రిని వ్యాఖ్యానించి కొట్టు సత్యనారాయణ అవినీతి చిట్టాకు లెక్కేలేదని, ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంత దోచుకున్నావో ప్రజలు వద్ద పెద్ద చిత్తానే ఉందనీ ఎడ్డేవా చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు తెలంగాణ వీరమహిళ విభాగం వైస్ చైర్మన్ పిల్లా నాగరత్నం గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు తాడేపల్లిగూడెం మండలం ప్రధాన కార్యదర్శి కర్రీ వెంకటస్వామి నాయుడు, బందెల కృష్ణా రావు, ఎడ్లపల్లి నాగబాబు, గట్టి శ్రీను, చిక్కాల పోసేశ్వ రరావు, గట్టిం హనుమ, మద్ది సోములు, మద్ది సుబ్బారావు, పుట్టాదేవి, మద్ది సోంబాబు, కాళ్ల ఉదయభాస్కర్, దండగర్ర జనసైనికులు వీరమహిళలు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.