ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలలో కీలకమైన ఎలక్షనీరింగ్కి ఎన్నారైలు ఏ విధంగా సహాయపడగలమనే విషయాలపై ఆదివారం జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి జనసేన నాయకులు వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు:
•ఈ ఎన్నికలలో ఏమైనా అవక తవకలు జరిగితే వెంటనే ఎన్నికల సిబ్బందికి తెలిపి కరెక్ట్ చేయించేలా చర్యలు తీసుకునేల చూడాలని అన్నారు.
•ఓటు వేయించే విధానాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్లా తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలి.
•జనసేన-టిడిపి పొత్తుతో పోటీచేసే ఎమ్మెల్యే అబ్యర్ధులకు నిత్యం కాంటాక్ట్లో ఉంటూ వారికి సహకరించాలి.
•గ్రామ మరియు వార్డ్ లెవెల్ నుంచి ఎలక్షనీరింగ్ ఎలా జరిపించాలి ఒక బుక్లెట్ మరియు వీడియో తయారుచేసి అవగాహన తీసుకువచ్చే ప్రయతం చేయాలి.
•నియోజకవర్గ పరిధిలో ఓటర్ లిస్ట్స్ థానికి ఎమ్మార్వో కార్యాలయం నుండి తెప్పించుకుని ఇంటింటికి తిరిగి వెరిఫై చేయించే ప్రయత్నం చేయాలి.
•తీసివేసిన ఓట్లు, దొంగ ఓట్లని లిస్ట్ అవుట్ చేసి వాటిపై అవగాహన కల్పించి ఎన్నికల సిబ్బందికి తెలియజేయడం.
•కొత్త ఓట్లు నమోదు చేయిం చే విధంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం.
•మీడియా సహకారం తీసుకుని ముందుకు వెళ్ళాలి.