జనసేన బలోపేతానికి కృషి చేస్తా: ఎన్ని రాజు

శ్రీకాకుళం: రాజాం జనసేన పార్టీ జనసేన-టీడీపి పార్టీ పాయింట్ అఫ్ కాంటాక్ట్గా నియమితులైన రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజుని కోర్లవలస గ్రామ జనసైనికులు టంకాల గణేష్, అనపర్తి గణేష్ జనసేన నాయకులు మర్యా దపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని రాజు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ నాపై పెట్టుకున్న నమ్మకానికి , మరింత బాధ్యతగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకువెళ్తానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.