గోరంట్లలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీ

గోరంట్ల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్లు గోరంట్లలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీ చేపట్టని విధంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తల బాగోగుల కోసం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తెచ్చాడు. కార్యకర్తల క్షేమం కోసం ఇంతలా ఆలోచించే నాయకుడు చరిత్రలో నిలిచిపోతారని, రానున్న 2024 ఎన్నికలలో పొత్తు లో భాగంగా జనసేన – టిడిపి అధికారం చేపట్టబోతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, మండల నాయకులు నరేష్, నాగేష్, రాఘవేంద్ర, బాబావలి, శ్రీనివాసులు, వసీం , ఆంజనేయులు, శ్రీరాములు, రాజేంద్ర, శ్రీకాంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.