మైలవరం, ఇబ్రహీం పట్నం మండలం కేతనకొండ గ్రామంలో మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ (గాంధీ) హాజరవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులే జనసేన పార్టీకి ప్రధాన బలంగా పనిచేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ మరియు మండల స్థాయిలో జనసేన పార్టీ కీలక పాత్రపోషిస ్తుందని అన్నారు. జనసైనికులు మరింత ఉత్సాహంగా ప్రజా సమస్యలపై పోరాడాలని గ్రామస్థాయిలో పార్టీని మరింత బలో పేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేతనకొండ జనసేన పార్టీ అధ్యక్షులు కొమ్మూరు వెంకటస్వామి, కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు చెరుకుమల్లి సురేష్, నాగబాబు, ఎర్రంశెట్టి నాని, ప్రవీణ్, మండల కమిటీ సభ్యులు కొమ్మూరి హనుమంతరావు, అశోక్ కేతనకొండ టిడిపి నాయకులు మరియు గ్రామ నాయకులు బాల, పుల్లా రావు, రమేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.