రంపచోడవరం నియోజవర్గం : తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇంటింటికి ఉమ్మడి ప్రచారం బాబు షూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అడ్డతీగల మండలం, కిమ్మురు గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వం ఏర్పడితే అందించే పథకాల గురించి వివరించారు. ముఖ్యంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళలకు సంవత్సరానికి 18000 వేలు, ఇంటింటికి ఫ్రీ కుళాయి, మహిళలకు జిల్లాలో బస్సు ప్రయాణం ఫ్రీ మరెన్నో మంచి పథకాలు తీసుకువస్తారని కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం , పొడుగు సాయి, కుప్పాల మణికంఠ, పల్లాల రవి రాజశేఖర్ రెడ్డి , ముత్యాల చిన్నరెడ్డి , వెంకటే ష్, లోకేష్, స్వామి, నాగేశ్వ రరావు, శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండలం అధ్యక్షులు జర్తా వెంకటరమణారెడ్డి , జుజ్జు వరపు శ్రీనివాస్ చౌదరి, చెక్క వీరలక్ష్మి, ముర్ల సత్యవతి , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.