కాకినాడ రూరల్, జనసేన – తెలుగుదేశం రాష్ట్ర పార్టీల అధ్యక్షులు పిలుపు మేరకు ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో మరియు భవిష్యత్తు కార్యాచరణపై కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉభయ పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్ష తన స్థానిక కృషి భవన్లో జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రథమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, ఉభయ గోదావరి జిల్లాల మహిళా రీజనల్ కోఆర్డి నేటర్ శ్రీమతి కడలి ఈశ్వరి, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్య నారా యణ, పాల్గొని భవిష్య త్ కార్యా చరణ ఫై చర్చించుకున్నా రు. ఈ కార్య క్రమంలో జనసేన నాయకులు తాటికాయల వీరబాబు, బోగిరెడ్డి గంగాధర్, శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య , గంజా దుర్గా ప్రసాద్, కరెడ్ల గోవింద్, నూకల నారాయణ రావు, బండారు మురళి మరియు తెలుగుదేశం నాయకులు మాజీ శాసన్ సభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్య నారాయణ, పెంకే శ్రీనివాస్ బాబా, పేరా బత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసు దాసు, నూరుకుర్తి వెంకటేశ్వర రావు, రాందేవు సీతయ్య దొర, దేవు వెంకన్న తదితర నాయకులు పాల్గొన్నారు.